Online Test for AP DEECET 2016/Online Exam 2016 for AP D.Ed Admissions: AP Education Department has decided to conduct the AP DEECET 2016 in Online Mode i.e Online Exam would be conducted in AP for admission into Diploma in Education Course(Teacher Training Course). Every year, at least one lakh students write this exam. So, DIET CET will conducted in Online Mode for next year. Online Test will be conducted through computers. Online Exam For AP DEECET 2016, Online Test for DEECET AP 2016, Online Test for AP D.Ed 2016 Admissions
ఏపీ విద్యాశాఖ కసరత్తు, వ్యయ ప్రయాసలు తగ్గించే ఆలోచన:
డైట్సెట్-2016ను ఆన్లైన్లో జరపాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (ఉపాధ్యాయ విద్య)లో ప్రవేశాల కోసం జరిపే ఈ పరీక్షను ఆన్లైన్లో జరిపితే ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని భావిస్తోంది. ఈ పరీక్షను ఏటా కనీసం లక్ష మంది రాస్తారు. ఈ సంఖ్యకు తగినట్లు రహస్యంగా ప్రశ్నపత్రాల్ని తయారుచేయడం, ముద్రించడం, పరీక్షా కేంద్రాలకు పంపించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారంగా మారింది. పరీక్షల నిర్వహణలో 20వేల మంది వరకు పాలుపంచుకుంటున్నారు. ఒక్కో విద్యార్థి పరీక్ష రాసేందుకు కనీసం రూ.110 వరకు ఖర్చవుతోంది. కిందటేడు 1.30 లక్షల మంది 900 కేంద్రాల్లో పరీక్ష రాశారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో పరీక్షల్ని జరిపితే వ్యయం సగానికి సగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. నిర్ణీత వ్యవధిలోనే తరగతులు ప్రారంభమయ్యే అవకాశమూ ఉంది. 2015-16 విద్యా సంవత్సరం తరగతులు గతనెలలో ప్రారంభం కావడం గమనార్హం.
ఇంజినీరింగ్ కళాశాలలే పరీక్ష కేంద్రాలు: ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉండే కంప్యూటర్ల ద్వారా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. ఆన్లైన్లో కనీసం లక్ష ప్రశ్నలతో ప్రశ్నల నిధి (క్వచ్చిన్ బ్యాంక్) సిద్ధం చేస్తారు. ప్రతి విద్యార్థికీ ప్రశ్నపత్రం మారిపోతుంది. పరీక్ష ముగిసే సమయానికే మార్కులు తెలుసుకోవచ్చు. ఈ విధానంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ముందుగా నమూనా పరీక్షలను నిర్వహించాలన్న ఆలోచనా ఉంది. పరీక్ష కేంద్రాల్లో జరిపే రాతపరీక్షల మాదిరిగా ఒకరోజు కాకుండా కొన్ని రోజుల పాటు ఈ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై మాధ్యమిక విద్యా శాఖ కార్యదర్శి సిసోడియా మాట్లాడుతూ ‘ఆన్లైన్లో డైట్సెట్ను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించాం. ఈ విధానం ఎలా అమలు చేయాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నాం. ఆన్లైన్లో ఇప్పటికే జీమ్యాట్ వంటి పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. అందువల్ల డైట్సెట్కు ఎటువంటి ఆటంకాలు ఉండవు.ఏ సంస్థ ద్వారా ఈ పరీక్షను ఆన్లైన్లో జరపాలన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని' వివరించారు.
Artikel keren lainnya:
Belum ada tanggapan untuk "Online Test for AP DEECET 2016/Online Exam 2016 for AP D.Ed Admissions"
Post a Comment
Note: only a member of this blog may post a comment.